వీడియో: ముంబై పబ్‌లో గొడవ.. కస్టమర్లను రాడ్లతో చితకబాదిన బౌన్సర్లు..

నోయిడాలో హోటల్ సిబ్బంది కస్టమర్లపై దాడి చేసిన ఘటన మరువకముందే అలాంటి మరో సంఘటన తాజాగా చోటు చేసుకుంది.ఈసారి బాంద్రాలో ఎస్కోబార్ పబ్‌లో( Bandra Escobar Pub ) ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన వెలుగు చూసింది.

 Customers Beaten By Pub Bouncer And Staffs At Bandra Escobar Details, Escobar P-TeluguStop.com

ఈ పబ్ కి వీకెండ్స్ లో ప్రజలు పోటెత్తుతుంటారు.అయితే శనివారం నాడు కొంత మంది కస్టమర్లతో పబ్ సిబ్బంది( Pub Staff ) తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి యుద్ధ వాతావరణానికి దారి తీసింది.

క్షణాల్లోనే ఈ పరిస్థితి పెద్ద తగాదాగా మారింది.పబ్ సిబ్బంది కస్టమర్లను ( Customers ) చావబాదే దాకా వెళ్ళింది.

దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

సిబ్బంది, కస్టమర్లు ఒకకొకరు తోసుకుంటూ, రాడ్‌లను ఉపయోగించి కొట్టుకోవడం వైరల్ వీడియోలో కనిపించింది.ఈ ఫైట్‌ను రెండు వేర్వేరు క్లిప్‌లలో రికార్డ్ చేశారు.వాటిని ఒకటిగా కలిపి ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.

మొదటి భాగంలో పబ్ లోపల జరిగే గొడవ చూడవచ్చు.తర్వాత సిబ్బంది రాడ్లను ఉపయోగించి కస్టమర్లను కొట్టడం కనిపించింది.

రెండవ భాగంలో ఈ ఫైట్ వేరే ప్రాంతానికి వెళ్లడం చూడవచ్చు.అక్కడ సిబ్బంది కస్టమర్లను లిఫ్ట్‌లోకి నెట్టారు.

కోపంతో ఉన్న ఒక పబ్ ఉద్యోగి తనను రెచ్చగొడుతున్న కస్టమర్లలో ఒకరిని కొట్టడంతో లిఫ్ట్ లోపల గొడవ కొనసాగింది.ఈ గొడవలో కస్టమర్ బట్టలు చిరిగిపోయాయి.

పబ్ సిబ్బందికి, కస్టమర్లకు మధ్య జరిగిన గొడవకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఆరెంజ్ మింట్ అనే వేరొక ప్రదేశంలో వారం ముందు ఇలాంటి మరో సంఘటన జరిగింది.ఆ ఘటనలో కూడా సిబ్బంది యువకులను కొట్టారు, అయితే దాని వెనుక కారణం కూడా స్పష్టంగా లేదు.ఏదేమైనా ఈ తరహా ఘటనలు ఇటీవల సామాన్య ప్రజలను షాక్‌కి గురిచేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube