ఆ “నలుగురు” ఇక మాజీలవుతారా?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ మాటను ధిక్కరించి క్రాస్ ఓటింగ్ పాల్పడి పార్టీ పరువు తీసిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినా కూడా వైసీపీ అధిష్టానానికి కోపం చల్లారటం లేదట.వారిని ఎట్టి పరిస్థితు ల్లోనూ ఎమ్మెల్యే పదవుల నుంచి అనర్హులను చేయాలని వైసీపీ( YCP ) అధిష్టానం వ్యూహాలు సిద్ధం చేసుకుంటుందo ట.

 Crossvoted Mla Can Loose Their Mla Status , Mla Status, Mla , Mp Raghurama Krish-TeluguStop.com

వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం స్పీకర్కు ఫిర్యాదు చేయాలని, తద్వారా వారిని ఎమ్మెల్యే పదవులకు అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు తొందరలోనే వైసీపీ తరఫున అధికారికంగా ఫిర్యాదు చేయనున్నారట.అయితే లక్షల మంది చే ప్రత్యక్షంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలను అనర్హుల్గా ప్రకటించడం అంతసులువా అంటే కాదనే చెప్పాలి .

Telugu Mlaloose, Mla Status, Mpraghurama-Telugu Political News

వాళ్లు అధికారికంగా క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించారని , విప్ అతిక్రమించి ప్రత్యర్ధి పార్టీకి ఓటు వేశారని నిరూపించగలగాలి.ఓటింగ్ అన్నది రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగినందువల్ల ఇప్పుడు వారు ఇతర పార్టీకి ఓటు వేశారని వైసీపీ ఎలా నిరూపించగలుగుతుందన్నది అతిపెద్ద ప్రశ్న.తమ సౌలభ్యం కోసం కొన్ని కోడ్ గుర్తులు పెట్టు కోవడం రాజకీయాల్లో మామూలు విషయమే అయితే ఇదంతా అనధికారికంగా జరిగే పద్ధతి అధికారికంగా వారు విప్ ని ధిక్కరించారని నిరూపించడం కష్టసాధ్యమైన పని .సరిగ్గా ఇదే లూప్ హోల్ అడ్డుపెట్టుకొని గత మూడున్నర ఏండ్లుగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు( MP Raghurama Krishnamraju ) వైసీపీకి కంట్లో నలుసులా తయారయ్యారు ఆయన విప్ ని అతిక్రమించారని అధికారికంగా నిరూపణ చేయలేక ఆయన మీద ఇతర కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది.మరి ఇప్పుడు ఈ విషయంలో కూడా వాళ్ళు గీత దా టారని వైసీపీ పార్టీ అంటుంది కానీ వాళ్ళందరూ మేము అధిష్టానం చెప్పిన వాళ్ళకి ఓటు వేశామని ఇప్పటికే మీడియా ముఖంగా ప్రకటించారు.

Telugu Mlaloose, Mla Status, Mpraghurama-Telugu Political News

మరి ఇప్పుడు ఏ ఆధారాలు ఉన్నాయని స్పీకర్ కి ఫిర్యాదు చేయడానికి వైసిపి నేతలు రెడీ అయ్యారో చూడాలి.ఒకవేళ నిజంగా వారిని అనర్హత కి గురి చేసి ఉప ఎన్నికలు వచ్చినా కూడా వైసిపికి ఆ స్థానాల్లో గెలుపు నల్లేరుపై నడకా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవునని చెప్పలేం.ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనబడుతున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉప ఎన్నికలకు వెళ్లి ఆ సీట్లను గెలవడానికి వైసిపి ప్రభుత్వం రిస్క్ చేస్తుందా అంటే కచ్చితంగా చెప్పలేం కానీ తమను మోసం చేసిన నాయకులకు ఏదో రకంగా బుద్ధి చెప్పాలి అనే పట్టుదల మాత్రం వైసిపి నేతల్లో గట్టిగా కనిపిస్తుంది మరి ముందు ముందు జరిగే పరిణామాలు ఏంటో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube