ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ నేతలు కలిశారు.ఈ మేరకు తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని నేతలు గవర్నర్ కు వివరించారని తెలుస్తోంది.
గవర్నర్ తో సమావేశం అనంతరం టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ అబ్దుల్ నజీన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు.చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి జైలుకు తీసుకెళ్లారని మండిపడ్డారు.
చంద్రబాబును ఒక్కరోజైనా జైలులో పెట్టాలని జగన్ కంకణం కట్టుకున్నారని విమర్శించారు.ఈ క్రమంలోనే వైసీపీకి నాలుగున్నరేళ్లుగా చంద్రబాబుపై అవినీతి కనపడలేదా అని ప్రశ్నించారు.
జగన్ సర్కార్ అవినీతిని చంద్రబాబు నిత్యం ప్రశ్నిస్తున్నారన్న అచ్చెన్నాయుడు టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని వెల్లడించారు.