టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ప్రస్తుతం వరుస హిట్ లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
కానీ ఇందులో తన పాత్రతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.ఇక ఆ తర్వాత పలు సినిమాలలో కూడా ఎక్కువ అవకాశాలు అందుకోలేకపోయింది.
దీంతో అవకాశాల కోసం తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది ప్రియాంక.సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో బాగా హల్ చల్ చేస్తుంది.మొదట షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు అందుకొని టాలీవుడ్ లో అడుగు పెట్టింది.2017 లో కలవరమాయే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక.ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన టాక్సీవాలాలో నటించింది.
ఆ తర్వాత తిమ్మరుసు సినిమాలో నటించగా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.
ఇక వెంటనే వచ్చిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకోగా మంచి అభిమానం సంపాదించుకుంది.ఇక ఈమె మొదట్లో చూడడానికి అంత అందంగా ఆకట్టుకోలేకపోయినా.
ఇప్పుడు మాత్రం తెగ గ్లామర్ షో తో అందాల విందు వడ్డిస్తుంది.

నిజానికి గతంలో తాను తన అందం గురించి కూడా ఓపెన్ కామెంట్లు చేసింది.తన మేకప్ వల్లే తను అందంగా ఉన్నానని తెలిపింది.తన అందం విషయంలో తను చాలా ట్రోల్స్ కూడా ఎదుర్కున్నానని.
అవి తట్టుకోలేక అందం విషయంలో మరింత నాజూగ్గా, గ్లామర్ గా కనిపించాలని ప్రయత్నించినప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నానని తెలిపింది.
తనకు థైరాయిడ్ ఉందని.
అందుకు తనకు ఫేస్ పై పింపుల్స్, శరీర బరువులో మార్పులు వచ్చాయని తెలిపింది.ఆ తర్వాత ఆరోగ్యం పట్ల, శరీరం పట్ల జాగ్రత్త తీసుకొని సన్నబడినానని తెలిపింది.
అలా ప్రస్తుతం తన అందంతో బాగా గ్లామర్ షో చేస్తుంది.తెగ ఫోటో షూట్ లు చేయించుకుంటూ అభిమానులను బాగా ఫిదా చేస్తుంది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

అందులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.నిత్యం ఏదో ఒక ఫోటో తో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాలో ఒక ఫోటో షేర్ చేసుకుంది.అందులో తను ఒక కర్టన్ చాటున నిలబడి ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.
ఇక ఆ ఫోటోకు బూ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
దీంతో ఆ ఫోటో నెటిజన్లను ఆకట్టుకోగా తెగ లైకులు కొడుతున్నారు.
మరికొందరు కామెంట్లతో తన అందాన్ని పొగుడుతున్నారు.ఇక ఆ ఫోటో కి క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ కూడా ఫిదా కావడంతో క్యూట్ అంటూ ఒక కామెంట్ చేశాడు.
ఇక వెంటనే ప్రియాంక అతడిని ట్యాగ్ చేసి ఎవరు నువ్వు అని కామెంట్ చేసింది.దీంతో ఆ కామెంట్ చూసినవాళ్లంతా అతడు అంతర్జాతీయ క్రికెటర్ అంటూ అతడి గురించి చెబుతున్నారు.
ప్రస్తుతం ఆ కామెంట్ లు వైరల్ గా మారాయి.







