ఇద్దరు ఆడవాళ్ళు కలిసి సహజీవనం చేస్తే గర్భం దాల్చి పిల్లలు పుడతారా.ప్రపంచంలో ఇలాంటి విషయం ఎక్కడ, ఎవరు కూడా విని ఉండరు.
ఇది నిజమే అంటుంది క్రికెటర్ సారా టైలర్.ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డయానా, సారా టైలర్ లు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.
ఇక డయానా గర్భం దాల్చిందని ట్విట్టర్ ద్వారా ఆమె భాగస్వామి సారా టైలర్ ప్రకటించింది.డయానా తల్లి కావాలనే కోరిక, మరో 19 వారాల్లో నెరవేరనుంది అని సారా టైలర్ వెల్లడించింది.
ఇక డయానా గర్భం దాల్చిన సంగతి డయానాతో కలిసి సారా ట్విట్ చేసింది.వీరిద్దరూ లెస్బియన్ జంట కావడంతో ఐవీఎఫ్ విధానంలో డయానాకు ప్రెగ్నెన్సీ రావడం జరిగింది.
అంతర్జాతీయ స్థాయిలో స్టార్ వికెట్ కీపర్ లలో ఒకరు సారా టైలర్. 2016లో మానసిక సమస్యల కారణంగా 2019లో రిటైర్మెంట్ అయ్యింది.ఇంగ్లాండ్ వన్డే వరల్డ్ కప్ గెలవడంలో సారా కీలక పాత్ర పోషించింది.ఇంగ్లాండ్ తరఫున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ20 మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించింది.
తన కెరీర్ లో 2177 పరుగులు చేసిన సారా మూడుసార్లు ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక అయింది.
2009లో టీ20 వరల్డ్ కప్, 2009లో వన్డే వరల్డ్ కప్, 2017లో వన్డే వరల్డ్ కప్ గెలవడంలో సారా కీలక పాత్ర వహించింది.రిటైర్మెంట్ తర్వాత కుటుంబంతో సంతోషంగా గడుపుతోంది సారా.ఇక తాజాగా సారా, డయానా దంపతులు ట్విట్టర్ ద్వారా డయానా ప్రెగ్నెన్సీ విషయం అభిమానులతో పంచుకోవడంతో నెటిజన్లు అభినందనలు తెలిపారు.
క్రికెట్ అభిమానుల్లో మాత్రం ఇద్దరు ఆడవాళ్లు సహజీవనం చేస్తే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందని, అసలు ఎలా సాధ్యమవుతుంది అని రకరకాల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.ఇద్దరూ ఆడవాళ్లే కదా ఒకరికి గర్భం ఎలా సాధ్యం అనే ప్రశ్నలతో అభిమానులు సతమతమవుతున్నారు.