వడాపావ్ చేస్తున్న సచిన్.... ఇంతలో పిల్లి....

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఆయన గురించి తెలియని మరో విషయం ఏమిటంటే వంటలు చేయడం కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు.

అందుకే అప్పుడప్పుడు కిచెన్ లో తన టాలెంట్ ను చూపిస్తూ ఎదో ఒక డిష్ చేసి ఇంట్లో వారికి తినిపిస్తూ ఉంటాడట.అయితే అతడికి వడాపావ్ అంటే చాలా ఇష్టమట.

Unexpected Guest Appeared When Sachin Preparing Mumbai Famous Dish Vada Pav, Cri

ముంబై లో వడాపావ్ అంటే చాలా ఫెమస్.దీనిని ఇష్టపడని వారు ఎవరైనా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.

అలాంటి వడాపావ్ ను చెయ్యడానికి సచిన్ సిద్దమవ్వగా, అనుకోకుండా ఒక అతిధి అక్కడకు ప్రత్యక్షమైంది.ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ను సచిన్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నాడు.

Advertisement

వడాపావ్ చెయ్యాలి అని అనుకున్న సచిన్ కిచెన్ లో ఆ పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు అనుకోకుండా ఒక అతిధి వచ్చి చేరింది.దానికి సంబందించిన ఫోటోను కూడా సచిన్ ఇన్ స్టా లో షేర్ చేశాడు.

ఆ అతిథి ఎవరో తెలుసుకోవాలంటే స్వైప్ చేయండి అంటూ రెండు ఫొటోలను షేర్ చేశాడు.ఒక ఫోటోలో సచిన్ ఉండగా, మరో ఫోటోలో పక్క నుంచి తొంగి చూస్తున్న పిల్లి ఫొటో ఉంది.

ఆఫోటో కూడా తన ఇన్ స్టా లో షేర్ చేయడం తో అది కాస్త వైరల్ గా మారి నెటిజన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది.ఆ ఫోటో చూసిన మరో క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా నాకూ ఒక వడాపావ్ చేయమని సచిన్ ను రిక్వెస్ట్ చేశాడు.

మొత్తానికి లాక్ డౌన్ సమయంలో ప్రముఖులు సైతం ఇలా వంటగదిలో తమ టాలెంట్ ను చూపించుకుంటున్నారు.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు
Advertisement

తాజా వార్తలు