క్రికెట్: దిష్టి తగలకుండా ఈ టాటూ వేసుకున్నా: సూర్య కుమార్ యాదవ్

దిగ్గజ టీమిండియా ఆటగాడు, వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ అయినటువంటి స్టార్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్‌( Surya Kumar Yadav ) గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.ఇక అతని శరీరంపై ఎన్ని టాటూలు వుంటాయో లెక్కపెట్టడం కష్టం.

 Cricket: Surya Kumar Yadav Got This Tattoo Without Hitting The Target , Cricket-TeluguStop.com

అయితే సూర్య శరీరంపై వున్న టాటూలకు అర్థం అతను చెబితే కానీ ఎవరికీ తెలియదు.ఈ నేపథ్యంలో ‘మిస్టర్ 360’ తన టాటూల గురించి, వాటి అర్థం గురించి చెప్పుకుంటూ వచ్చాడు.

ఈ క్రమంలో తాను వేయించుకున్న మొదటి టాటూ( Tatto ) తన తల్లిదండ్రుల పేరని చెప్పుకొచ్చాడు.ఆ తర్వాత మిగిలిన టాటూలు వేయించుకోవడానికి ఇంట్లో అనుమతిగా ఆ టాటూ పనిచేసింద సూర్య చెప్పడం కొసమెరుపు.తన చేతిపై ఉండే కన్ను(ఈవిల్ ఐ) టాటూ( Evil eye’ tattoo ) గురించి కూడా మాట్లాడుతూ ‘నాకు చాలా సులభంగా దిష్టి తగులుతుందని నా భర్య దేవిషా శెట్టి నమ్మేది.అందుకే దిష్టి కన్ను టాటూ వేయించుకోమని చెప్పింది’ దాంతో తన భార్య మాట కాదనలేక ఆ టాటూ వేసుకున్నానని పేర్కొన్నాడు.

అలాగే భుజంపై టాటూ మా అమ్మానాన్న ఫొటో అని, దాన్ని నాలుగైదు సంవత్సరాల క్రితం వేయించుకున్నా అని చెప్పుకొచ్చాడు.అదేవిధంగా ప్రశాంతంగా ఉన్న సింహం బొమ్మ టాటూని చూపిస్తూ నేను కూడా అలాగే వుంటా అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు సూర్య.తన చేతిపై ఉన్న బాణాల టాటూ గురించి వివరిస్తూ.జీవితం మనల్ని వెనక్కు లాగినప్పుడు.వెంటనే ముందుకు వెళ్లేందుకు సంకేతంగా ఉంటుందని ఈ టాటూ వేయించుకున్నా అన్నాడు.అంతేకాకుండా తన చేతిపై ఉన్న మరో టాటూ గురించి చెబుతూ అది న్యూజిల్యాండ్‌లోని మోరీ తెగకు చెందిన గుర్తు.

అ టాటూ అదృష్టాన్ని తీసుకురావడమే కాక తనను ప్రశాంతంగా ఉంచుతుందని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube