మెగాస్టార్‌తో చిందులేయనున్న కన్నడ బ్యూటీ

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సైరా నరసింహారెడ్డి సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే.కాగా సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో చిరు తన 152వ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

 Crazy Heroine To Shake Her Leg With Chiranjeevi-TeluguStop.com

ఈ సినిమాను ఇటీవల చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగా, ఈ సినిమాలోని పాత్ర కోసం చిరు తనను తాను మేకోవర్ చేసుకుంటున్నారు.

అయితే చిరు 152వ చిత్రంలో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేసిన చిత్ర యూనిట్, ఈ సినిమాలోని ఓ స్పెషల్ పాటలో చిరుతో డ్యాన్స్ చేయడానికి క్రేజీ హీరోయిన్‌ను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది.

ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన, ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరోయిన్‌గా మారింది.మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, బన్నీ-సుకుమార్ సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటీని చిరు సరసన డ్యాన్స్ చేయించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

Telugu Chiranjeevi, Chiru, Koratala Siva-Movie

మణిశర్మ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ను అతిత్వరలో ప్రారంభించనున్నారు.కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ సినిమాకు గోవింద ఆచార్య, గోవింద హరి గోవింద అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube