Kunamneni Sambasiva Rao: దురుద్దేశం తోనే మోడీ పర్యటన - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల అనంతరం హిమాయత్ నగర్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు చడా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కునమనేని సాంబశివరావు లను కలిసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.దేశ ప్రధాని కి తెలంగాణ పట్ల అనుకోని ప్రేమ వచ్చింది.12 వ తేదీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నారని తెలిసింది.దురుద్దేశం తోనే మోడీ పర్యటన.ఎన్నికల తరువాత విజయం సాధించి ఈ ఫ్యాక్టరీ ప్రారంభిద్దామని అనుకున్నారు.షెడ్యూల్ కూడా అప్పటిదే.గత సంవత్సరం ప్రారంభమైన ఫ్యాక్టరీ ఇప్పుడు ప్రారంభించడం ఏంటి.

 Cpi State Secretary Kunamneni Samba Siva Rao Comments On Modi Telangana Tour Det-TeluguStop.com

దానిని మేము ఏదో చేశామని మీ ఖాతాలోవేసుకుందాంనుకున్నారా.మీకు నైతికత లేదు.మీరు టెక్నీకల్ ప్రధాని మాత్రమే.ఇక్కడ మీ ప్రభుత్వం లేదు.ఎమ్మెల్యేలను గుంజుకొని ప్రభుత్వంకూల్చాలనుకుంటున్నారు.8 సంవత్సరాల్లో తెలంగాణ కి మీరు ఏం చేశారు.విభజన చట్టంలోని ఏఒక్క హామీ అయిన నెరవేర్చరా…? మీ మంత్రి కిషన్ రెడ్డి ద్వారా బయ్యారం స్టార్ట్ కాదని చెప్పారు.సింగరేణి ఫ్రవేటికరణ చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు.

మా తెలంగాణ గడ్డ మీద ఉన్న బొగ్గు బావులను ఆదాని, అంబానీ కి కేటాయించిన నువ్వు మా గడ్డ మీద అడుగు ఎలా పెడతావ్.మా బ్యాంక్ ,ఉక్కు కర్మాగారాలు,lic లు ప్రైవేటు కు ఇస్తే ఎలా.

ప్రధాని మోడీ తెలంగాణ కు రావద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం.10 వ తేదీ నుండి బొగ్గు కర్మాగారంలో ఆందోళన చేస్తాం.తెలంగాణ లో మంత్రులను నా ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నానని గవర్నర్ అన్నారు.మీరు గవర్నర్ రా.లేక బీజేపీ కార్యకర్తనా.ముందు తేల్చాలి.

తమిళనాడు, కేరళ, ఢిల్లీ, తెలంగాణ లో గవర్నర్ ల తీరు సరిగా లేదు.గవర్నర్ ల వ్యవస్థ సరిగా లేదు.

బ్రిటిష్ కాలం నుండి వచ్చిన ఈ గవర్నర్ వ్యవస్థ ని రద్దు చేయాలి.మేము మా జాతీయ మహాసభ ల్లో కూడా తీర్మానం చేసాం.

తమిళ్ సై తెలంగాణ వదిలి వెళ్లిపోవాలి.త్వరలో పెద్ద ఎత్తున రాజ్ భవన్ ముట్టడి చేస్తాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube