బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలలో గవర్నర్ల ద్వారా వేధింపులకు గురి చేయడం మోదీ సర్కార్కు తగదని ఆయన హితవు పలికారు.తిరుపతి సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, నల్లధనాన్ని రద్దు చేయడంలో పూర్తిగా విఫలమైన మోదీ.
జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.దేశంలోని ప్రైవేటు విమానాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏ.పికీ ఎందుకొచ్చారో అర్థం కావడం లేదన్నారు.
పోలవరం,ప్రత్యేక హోదా, ఉమ్మడి ఆస్థుల పంపిణీ పై ప్రధాని మోదీని సి.యం.జగన్ ప్రశ్నించక పోవడం దారుణమన్నారు.ఈ అంశమే బీజేపీ, వైకాపాకున్న పెవికాల్ బంధాన్ని తెలియజేస్తోందన్నారు నారాయణ.