సమర్థవంతమైన పనితీరు కనబరిస్తే దోషులకు సత్వరం శిక్షలు పడుతాయని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ అన్నారు.
ఈరోజు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో భాధ్యతలు నిర్వహిస్తున్న ప్రొబిషనరీ సబ్ ఇన్స్పెక్టర్ల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ….
నిర్ణీత కాలంలో ఎఫ్ఐఆర్ నమోదు నుండి నిందితుల అరెస్టు, దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు వరకు లోతుగా అధ్యయనం చేయడం తద్వారా వృత్తి నైపుణ్యతను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు.
శిక్షణలో నేర్చకున్న ప్రతి అంశాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, రికార్డుల నిర్వహణ క్రమపద్ధతిలో వుండాలని , పోలీస్ స్టేషన్ల స్టేషనరీ విభాగం పరిశుభ్రంగా వుండాలని అదేవిధంగా ఒత్తిడికి గురి కాకుండా సురక్షితమైన , ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొవడం చాల ముఖ్యమైనదని అన్నారు.
ఈ సందర్భంగా ఇటీవల ఎస్సైలు విచారణ చేపట్టిన పలు కేసు రికార్డులను పరిశీలించారు.ఫంక్షనల్ వర్టికల్స్ అమలులో తీసుకొన్న చర్యలు తనిఖీ చేశారు.