ప్రపంచవ్యాప్తంగా అందరినీ గల గల లాడించిన కరోనా పుట్టినిల్లు అంటే చైనా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే గత మూడు ఏళ్లుగా కరోనా కలకలం అందరిని హడలించింది.
కరోనా కారణంగా ఎంతోమంది మృతి చెందారు.అయితే కొద్ది కాలం వరకు సద్దుమణిగిన కరోనా, మళ్ళీ చైనాలో పుట్టుకొచ్చింది.
అయితే ఈసారి జాంబీ వైరస్ లాగా కరోనా అందరికీ సోకుతుంది.అయితే చైనాలో ఆంక్షలు కఠినంగా ఉండడం, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం తో సడలించాల్సిందిగా కోరుతూ నిరసనలు వెల్లువెత్తాయి.
దీంతో చైనా జీరో కోవిడ్ అంశాల్ని సడలించింది.అయితే చైనాలో మళ్ళీ కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి.అయితే దీన్ని ఇలాగే వదిలేస్తే ఏప్రిల్ 1వ తేదీకి చైనాలో కోవిడ్ కేసులు గరిష్ట స్థాయి కి చేరుకుంటాయని అక్కడి అధ్యాయానాలు హెచ్చరించాయి.ఇక మళ్లీ కరోనా రావడంతో డ్రాగన్ కంట్రీ మళ్ళీ కఠిన ఆంక్షలు అమలు చేసింది.
కేసులు భారీగా పెరగడంతో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని అక్కడి అధికారులు హెచ్చరించారు.దీంతో కరోనా భయంతో అక్కడి ప్రజలు బయటికి రావడానికి హడలిపోతున్నారు.

ఇక మీడియా నివేదికల ప్రకారం అక్కడ బీజింగ్ లో కోవిడ్ కారణంగా చాలామంది మరణిస్తుండడంతో మృతుల సంఖ్య బాగా పెరుగుతుంది.అలాగే చైనాలో రెండు వారాల నుంచి వైరస్ తో మరణించిన వారి సంఖ్య పెరిగినట్టు అక్కడ నివేదికలు చెబుతున్నాయి.అయితే బీజింగ్ స్మశాన వాటిక లోని సిబ్బంది ప్రకారం తాజాగా అక్కడ 30 మంది కోవిడ్ బాధితుల మృతదేహాలు దహనం చేశారని ఫైనాన్షియల్ టైమ్స్ తో వాళ్ళు చెప్పారు.ఇకపోతే ఈసారి కరోనా మృతదేహం నుండి ఇతరులకు సోకే అవకాశాలు ఉన్నాయంటూ తెలుస్తోంది.
దీంతో కరోనాతో మరణించిన మృతదేహాలను దహనం చేయడానికి కూడా అక్కడి సహాయక చర్యలు భయపడుతున్నాయి.







