బిగ్ బాస్ సీజన్6 కు విజేతగా నిలుస్తానని చెప్పిన రేవంత్ ఎంతో కష్టపడి తన కలను నెరవేర్చుకున్నారు.రేవంత్ విజేతగా నిలవడంతో రేవంత్ కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
రేవంత్ మామ శ్రీనివాస్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.రేవంత్ కప్పు గెలవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
నా పోలికలతో పాటు రేవంత్ కు నా కోపం కూడా వచ్చిందని శ్రీనివాస్ తెలిపారు.బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ ఎలా ఉన్నాడో రియల్ లైఫ్ లో కూడా అదే విధంగా ఉంటాడని చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు రేవంత్ అస్సలు మారలేదని ఆయన కామెంట్లు చేశారు.రేవంత్ నాన్న చిన్నప్పుడే చనిపోయారని ఆయన వెల్లడించారు.రేవంత్ ప్రయోజకుడు కావడంతో చాలా సంతోషంగా ఉందని శ్రీనివాస్ తెలిపారు.
నా పిల్లల కంటే నాకు రేవంత్ అంటే ఇష్టమని శ్రీనివాస్ కామెంట్లు చేశారు.కుక్క తోక లాగడం ఇలా అల్లరి చేసేవాడని ఆయన వెల్లడించారు.చిన్నప్పుడు రేవంత్ చేతిలో సోడా సీసా పేలిపోయిందని ఆ సమయంలో చేతికి గాయాలయ్యాయని శ్రీనివాస్ వెల్లడించారు.రేవంత్ క్రికెట్ ఎక్కువగా ఆడేవాడని, జామకాయలు కోసేవాడని అయితే అబద్ధాలు మాత్రం చెప్పేవాడు కాదని ఆయన చెప్పుకొచ్చారు.

రేవంత్ కు దైవ భక్తి ఎక్కువని శ్రీనివాస్ కామెంట్లు చేశారు.ప్రస్తుతం రేవంత్ మణికొండలో ఉంటున్నాడని ఎక్కడికి వెళ్లినా పెద్దల కాళ్లకు దండం పెడతాడని ఆయన తెలిపారు.రేవంత్ సెంటిమెంట్స్ ను కూడా ఎక్కువగా నమ్ముతాడని రేవంత్ మామయ్య చెప్పుకొచ్చారు.రేవంత్ మామయ్య వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రేవంత్ విజేతగా నిలవడంతో అతని ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.రేవంత్ కు బిగ్ బాస్ షో వల్ల బెనిఫిట్ కలుగుతుందో లేదో చూడాల్సి ఉంది.







