Omicron : అమెరికాలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. 4 రాష్ట్రాల్లో కేసులు, న్యూయార్క్‌లో అత్యధికం

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది.ఇప్పటికే 30కి పైగా దేశాల్లో 370కి పైగా కేసులు వెలుగుచూశాయి.

భారత్‌లో కూడా ఒమిక్రాన్ ప్రవేశించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఇప్పటికే వెలుగు చూసిన దేశాల్లో ఈ మహమ్మారి అమితమైన వేగంతో దూసుకెళ్తోంది.ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికాలోనూ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది.

ఇప్పటి వరకు అక్కడ నాలుగు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.అమెరికాలో తొలికేసు నవంబర్‌ 25న కాలిఫోర్నియాలో నమోదవ్వగా.

ఇప్పుడు అది మిన్నెసొటా, న్యూయార్క్‌, కొలరాడోకు విస్తరించింది.అత్యధికంగా న్యూయార్క్‌లో 5 కేసులు వున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Advertisement

ఇందులో 67 ఏండ్ల మహిళ కూడా ఉన్నారని, స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.ఆమె ఈమధ్యే దక్షిణాఫ్రికా వెళ్లి.

నవంబర్‌ 25న అమెరికాకు తిరిగి వచ్చారని, గత మంగళవారం ఆమెకు కరోనా పాజిటివ్‌‌గా తేలిందని అధికారులు వెల్లడించారు.ఈ నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ క్యాథి హోచుల్ స్పందించారు.

‘వ్యాక్సిన్‌.బూస్టర్‌ తీసుకుని, మాస్క్‌ ధరించాలని ట్వీట్‌ చేశారు.

మరోవైపు ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ ఆంథోనీ ఫౌచీ స్పందించారు.పౌరులంతా వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని.అలాగే బూస్టర్‌ డోసు విషయంపైనా ఆలోచించాలని ఫౌచీ చెప్పారు.

ఇండియన్2 టికెట్స్ తమిళనాడులోనే చీపా.. టికెట్ రేట్లు పెంచి ఏం సాధిస్తారంటూ?
ఆ విషయంలో భయపడుతున్న ఎన్టీఆర్.. అలా చేస్తే రిస్క్ చేసినట్టే అని ఫీలవుతున్నారా?

బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.అటు కొత్త వేరియంట్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణీకులపై కఠిన ఆంక్షలు విధించేందుకు సైతం అగ్రరాజ్యం సిద్ధమౌతోంది.

Advertisement

అలాగే కోవిడ్ పరీక్షలు, ఇతర నిబంధనల్ని కఠినతరం చేయనుంది.అమెరికాకు వచ్చే ప్రయాణీకులు 72 గంటలు ముందు కాకుండా ఒకరోజు ముందు పరీక్షలు చేయించుకునేలా నిబంధనలు రానున్నాయి.

వ్యాక్సిన్ తీసుకున్నా, తీసుకోకపోయినా కొత్త నిబంధనలు వర్తించనున్నాయి.

తాజా వార్తలు