Gyanvapi : జ్ఞానవాపి మసీదులో హిందువుల పూజల నిర్వహణపై కోర్టు తీర్పు..!!

ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) రాష్ట్రంలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో హిందువుల పూజా కార్యక్రమాల నిర్వహణపై అలహాబాద్ హైకోర్టు( Allahabad High Court ) తీర్పును వెలువరించింది.

ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అంజుమన్ మసీదు కమిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం అంజుమన్ మసీద్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

అలాగే దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.అయితే ప్రార్థనా మందిరి సెల్లార్ లో పూజలు చేసుకునేందుకు హిందువులను( Hindus ) అనుమతించే విధంగా ఇటీవల వారణాసి జిల్లా కోర్టు తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?
Advertisement

తాజా వార్తలు