దేశంలో రేపు కేసుల సంఖ్య అంతకంతకు పెరిగి పోతూనే ఉన్నాయి.అయితే కేసుల్లో శిక్షలు పడుతున్న వారి సంఖ్య మాత్రం ఒకటి రెండుగానే ఉంటున్నాయి.
దేశ వ్యాప్తంగా రోజుకు 50 రేప్ కేసులు నమోదు అయితే కనీసం ఒకటి రెండు రేప్ కేసుల తుది తీర్పు కూడా రావడం లేదు.ఇలాగే రేప్ కేసులు పెరుగుతూ పోతే ఆ తర్వాత కొన్నాళ్లకు వేల కొద్ది, లక్షల కొద్ది రేప్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
హత్యకేసు పెడ్డింగ్‌లో ఉన్నా పర్వాలేదు కాని, రేప్ కేసు పెడ్డింగ్‌లో ఉంటే, ఆ రేప్ చేసిన వ్యక్తి మళ్లీ బయట సమాజంలో తిరుగుతూ మరిన్ని అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందని మహిళ సంఘాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయినా కూడా కోర్టులు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు.
తాజాగా ఒక రేప్ కేసు విచారణలో విచిత్రమైన సంఘటన జరిగింది.రాజు అనే వ్యక్తిపై రేప్ కేసు నమోదు అయ్యింది.నాలుగు సంవత్సరాలుగా ఆ రేప్ కేసు విచారణ జరుగుతుంది.ప్రతి వారం కూడా రాజు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.
అయితే ఆరు నెలలుగా రాజు కోర్టుకు హాజరు కాలేదు.కోర్టు పలు సార్లు హెచ్చరించినా కూడా అతడు కోర్టుకు రాలేదు.
దాంతో కోర్టు రాజుపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేయడం జరిగింది.దాంతో కోర్టు ముందు రాజు తన తప్పుకు క్షమాపణ అడిగి తనపై జారీ చేసిన వారెంట్‌ను రద్దు చేయమంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది.

రాజు క్షమాపణ అంగీకరించిన జడ్జిగారు, ఇకపై ఖచ్చితంగా కోర్టు హియరింగ్‌లకు వస్తానంటూ మాట తీసుకుని, అరెస్ట్ వారెంట్ రద్దు చేసేందుకు గాను ఐదు మొక్కలు పెంచాలని, వాటి మనుగడ చూసుకోవాలని కోర్టు సూచించింది.అయిదు చెట్లను రాజు పెట్టేలా పోలీసు వారు చూసుకోవాలని కోర్టు ఆదేశించింది.మొత్తానికి రేప్ కేసు నింధితుడు కోర్టుకు రాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేయడం బాగానే ఉంది కాని, దాన్ని రద్దు చేయడానికి అయిదు చెట్టు నాటమని శిక్ష విధించడం ఏంటీ జడ్జ్ గారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.అయితే మన న్యాయ వ్యవస్థపై మనం ఎలాంటి కామెంట్స్ చేయకూడదు.
అలా కామెంట్స్ చేస్తే చట్టరీత్యా నేరం అవుతుంది.అప్పుడు కామెంట్స్ చేసిన వారికి కూడా చెట్టు నాటడమో, చెత్త ఎత్తడమో పనిష్మెంట్ ఉంటుంది జాగ్రత్త.