గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 జన జీవనాన్ని అతలాకుతలం చేసింది.కోవిడ్ 19 పుట్టినిల్లు అయిన చైనా లో మళ్ళీ కోవిడ్ 19 కేసులు పెరిగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు చైనా ప్రయాణికులపై కొన్ని రకాల ఆంక్షలు విధించాయి.
స్వదేశీ విదేశీయుల పై చైనా ప్రయాణ ఆంక్షలు విధించిన అక్కడి నుండి వచ్చిన వారిపై రెస్ట్రిక్షన్స్ విధిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరిగిపోతూనే ఉంది.ఇప్పటికే భారత్, జపాన్, మలేషియాలు లాంటి దేశాలు చైనా నుంచి తమ దేశానికి వస్తున్న ప్రయాణికుల పై ఆంక్షలు విధించాయి.
ఇంకా చెప్పాలంటే తాజాగా ఈ జాబితాలో అమెరికా కూడా చెరీపోయింది.చైనా నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కరోనా నెగటివ్ సర్టిఫికెట్ చూపించాలని కఠినమైన నిబంధనలు అన్ని దేశాలు అమలు చేశాయి.
కరోనా కు పుట్టినిల్లు అయినా చైనా లో కోవిడ్ 19 విలయతాండవం చేస్తున్నా ఈ సందర్భంలో అధికారులు ఈ మేర నిర్ణయం తీసుకున్నట్లు మీడియా కు వెల్లడించారు.
చైనా నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే ప్రయాణికులు ప్రయాణానికి రెండు రోజుల ముందే పిసిఆర్ టెస్ట్ చేసుకోవాలని కచ్చితంగా నెగిటివ్ రిపోర్ట్ ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
అంతే కాకుండా చైనా నుంచి నేరుగా కాకుండా సియోల్, టోరెంటో, వాంకోవార్ మీదుగా వచ్చే ప్రయాణికులకు కూడా ఇదే షరతు వర్తిస్తుందని ఈ కఠినమైన సందర్భంలో అన్ని దేశాలు వెల్లడించాయి.

అంతే కాకుండా వచ్చే నెల ఐదు నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపారు చెబుతున్నారు.ఈ నిబంధనలను పాటించని ప్రయాణికులకు ఎట్టి పరిస్థితులలోనూ విమాన ప్రయాణానికి అనుమతించమన స్పష్టం చేశారు.ఇంకా చెప్పాలంటే ఈ నిబంధనను ఎంతో కఠినంగా పాటించే అవకాశం ఉందని ఉన్నత అధికారులు చెబుతున్నారు.







