బీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్( Karne Prabhakar ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మేడిగడ్డతో( Medigadda ) రైతులకు ఎంతో మేలు జరిగిందని చెప్పారు.అన్ని పనులపై అవినీతి బురద అంటగడుతున్నారని విమర్శించారు.
మంత్రులు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారన్నారు.బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేస్తామని

కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) చేస్తున్న కుట్రలను బయటపెట్టేందుకే తాము ఛలో మేడిగడ్డ( Chalo Medigadda ) పర్యటన చేస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డను కూల్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు.
ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు.







