షెల్ కంపెనీల పేరుతో అవినీతి జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచామని తెలిపారు.
ఫేక్ ఇన్వాయిస్ లతో రూ.241 కోట్లు దోచేశారని సజ్జల ఆరోపించారు.ఐటీ శాఖ నోటీసుల్లో అన్ని లింకులు బయటపడ్డాయని చెప్పారు.ప్రజల సొమ్మును షెల్ కంపెనీల పేరుతో దోచేశారని విమర్శించారు.చంద్రబాబు డైరెక్షన్ లోనే స్కిల్ స్కామ్ జరిగిందన్న సజ్జల గంటా సుబ్బారావును ఐదు పదవుల్లో కూర్చోబెట్టారని తెలిపారు.అదేవిధంగా ఏ రోజూ స్కిల్ స్కామ్ జరగలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించలేదని తెలిపారు.
ఈ క్రమంలోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుతో సంబంధం లేదని చంద్రబాబు నిరూపించుకోవాలని సూచించారు.చంద్రబాబుకు వచ్చింది బెయిల్ మాత్రమేనని, అపోహలొద్దని పేర్కొన్నారు.
చంద్రబాబుకు బెయిల్ రాగానే నిర్దోషి అనుకుంటే పొరపాటేనని తెలిపారు.