హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్( Rajendra Nagar MLA Prakash Goud )కు ఎదురుదెబ్బ తగిలింది.ఆయనకు బండ్లగూడ జాగీర్ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్పొరేటర్లు( BRS Municipal Corporators ) షాక్ ఇచ్చారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉండగా వీరిలో 16 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి చేరారు.ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రకాశ్ గౌడ్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
దాదాపు పార్టీలో చేరే సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తో భేటీ అయిన ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్( Congress ) లో చేరే ఆలోచనను విరమించుకున్నారు.దీంతో ప్రకాశ్ గౌడ్ పై వ్యతిరేక వర్గీయులు తిరుగుబావుటా ఎగురవేశారు.
ఇందులో భాగంగానే ఆయనకు దగ్గర వ్యక్తిని మేయర్ పదవి నుంచి వ్యతిరేకవర్గం దింపేసింది.ఈ క్రమంలోనే చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పోరేటర్లు కాంగ్రెస్ లో చేరారు.