ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రజల ప్రాణాలు అపాయంలో ఉన్నాయన్న విషయం అర్ధం చేసుకునే వారికి ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది.ఇకనైన నిర్లక్ష్యం వీడితే ప్రాణాలను కాపాడు కోవచ్చు.
ఇకపోతే కరోనా వైరస్ మొదటి వేవ్ ఇండియాలో అంతగా ప్రభావం చూపించక పోయినా ఈ సెకండ్ వేవ్ పార్ట్ టూ గా వచ్చి విద్వంసాన్ని సృష్టిస్తుంది.దీని ఫలితంగా దేశంలో సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్నాయి.
ఇకపోతే కరోనా మొదటి వేవ్‌లో దీని బారిన పడిన వారికి ట్రీట్మెంట్ సమయం ఎక్కువగా తీసుకోలేదు.అప్పుడు కరోనా మీద అవగహన కూడా తక్కువే.కానీ ఈ సంవత్సర కాలంలో కోవిడ్ మీద పూర్తి స్దాయిలో పరిశోధనలు జరిగాయి.అంతే కాదు వ్యాక్సిన్ కూడా వచ్చింది.
అయినా ఈ కొత్తవేరియంట్ మాత్రం భీతి గొల్పేలా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది.
ఇక ఈ కోవిడ్ సెకండ్ వేవ్ ట్రీట్మెంట్ సమయాన్ని కూడా పెంచిందని వైద్య నిపుణులు చెప్తున్నారు.
కాగా కరోనా వైరస్ ఉత్పరివర్తనాల కారణంగా బలం పుంజుకుందని, ఫలితంగా కనీసం 15 రోజులపాటు ట్రీట్మెంట్ అందించాల్సి వస్తోందని వైద్యులు చెప్తున్నారు.ఇకపోతే ట్రీట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యాక కనీసం వారం రోజులపాటు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని చెప్తున్నారు.








