కరోనా టైంలో పుట్టిన కవలలు... పేర్లు కరోనా, కోవిడ్

ప్రస్తుతం దేశం మొత్తం కరోనా విలయతాండవం చేస్తుంది.మన దేశంలో కొంత వరకు నియంత్రనలోనే ఉనే ఇతర దేశాలలో అయితే మరింత దారుణంగా వ్యాపిస్తుంది.

ఇప్పటికే అమెరికా, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలలో లక్షల సంఖ్యలో కరోనా బాధితులు ఉన్నారు.ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇంత ఆధునిక వైద్యంలో కూడా వారి ప్రాణాలు కాపాడలేకపోతున్నారు.ఇండియాలో కూడా ఇప్పటి వరకు 75 మంది చనిపోయారు.

కరోనా బాధితుల సంఖ్య రెండు వేలు దాటిపోయింది.ఇదిలా ఉంటే ఇలాంటి విలయతాండవంలో చత్తీస్ ఘడ్ లో ఓ మహిళ కవల పిల్లలకి జన్మనిచ్చింది.

Advertisement

వారికి కరోనా, కోవిడ్ అని పేర్లు పెట్టారు.ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రీతివర్మ అనే మహిళ ఈనెల 26వ తేదీన పురిటినొప్పులు రావడంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు.లాక్‌డౌన్‌ కట్టడితో క్లిష్ట పరిస్థితుల్లో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.

ఈనెల 27వ తేదీ తెల్లవారు జామున ఆమె పండంటి కవలలకు జన్మనిచ్చింది.ఆ పిల్లలకు కరోనా, కోవిడ్ అని పేర్లు పెట్టి ఈ దంపతులు మురిసిపోతున్నారు.

ఈ సందర్భంగా బిడ్డల తల్లి ప్రీతివర్మ ఓ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధితో మాట్లాడుతూ నేను గర్భవతిని అయ్యాక పుట్టే పిల్లలకి ఏ పేరు పెట్టాలి అని ఆలోచించాం.లాక్‌డౌన్‌ కష్టాల నేపథ్యంలో ఆసుపత్రికి చేరేందుకు, అనంతరం కష్టాలు చూశాక మనసు మార్చుకున్నాం.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఈ సమయంలో మాకు, వారికి జీవితాంతం గుర్తుండాలన్న సరికొత్త ఆలోచన వచ్చింది.ఆసుపత్రి సిబ్బంది కూడా మా కవల పిల్లలను కరోనా, కోవిడ్ అని ముచ్చటగా పిలుస్తుండడం మాకు ఆనందాన్ని కలిగించింది.

Advertisement

అందుకే మేము ముందు అనుకున్న పేర్లను పక్కన పెట్టి ఈ కొత్త పేర్లు వారికి పెట్టుకున్నాం అని తెలిపింది.

తాజా వార్తలు