కరోనా నుంచి రక్షణ కలిగిస్తుందని చనిపోయిన పామును ఏం చేశాడంటే.. ?

కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.అయితే కోవిడ్ వల్ల కొందరు మూఢనమ్మకాలు కూడా పెంపొందించుకుంటున్నారు.

ఇప్పటికే గో మూత్రం తాగితే, ఆవుపేడ ఒంటికి పూసుకుంటే లాంటి ఇతర అపనమ్మకాలను నమ్మి లేనిపోని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఇలాంటి అపోహతోనే ఒక వ్యక్తి చనిపోయిన పామును తిన్నాడు.

Man Ate Dead Snake To Get Rid Off Covid, Tamil Nadu, Madurai, Perumapatti, Eat S

ఆ వివరాలు చూస్తే.తమిళనాడు మదురై జిల్లా పెరుమపట్టి ప్రాంతానికి చెందిన వడివేలు అనే వ్యవసాయ కూలీ మరణించిన పామును తింటూ ఒక వీడియో తీసుకున్నాడట.

అంతటితో ఊరుకోకుండా ఆ వీడియోలో పామును తింటే కరోనా రాదని చెప్పడం విడ్డూరం.ఇక ఆ వీడియో కాస్త స్థానిక అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళారట.

Advertisement

దీని పై స్పందించిన పోలీసులు వెంటనే వడివేలును అరెస్ట్ చేసి, ఏడు వేల రూపాయలు జరిమానా విధించారట.అసలు పెద్ద పెద్ద మందులకే లొంగని కరోనా పామును తింటే రాదని చెప్పడం చూస్తుంటే మనం ఇంకా ఆటవిక ప్రపంచంలోనే బ్రతుకుతున్నామని అర్ధం అవుతుంది.

13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?
Advertisement

తాజా వార్తలు