దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది.ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 41 లక్షలకు దాటాయి.
రాష్ట్రాల్లో వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
క్లినికల్ ట్రయల్స్ చివరిదశకు చేరుకున్నాయని చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ మార్కెట్ లో ఎప్పుడు అందుబాటులో వస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.వ్యాక్సిన్ లు క్లినికల్ ట్రయల్స్ కే పరిమితమయ్యాయని ఆరోపిస్తున్నారు.
ఆలస్యం చేసే కొద్ది వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
రోజూ 2వేలకు మించి కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,574 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొంది.దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,969కి చేరింది.
నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 9 మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు.దీంతో మరణాల సంఖ్య 886కు చేరింది.
గడిచిన 24 గంటల్లో 2,927 మంది కరోనా నుంచి క్యూర్ అవ్వగా.ఇప్పటివరకూ 1,07,530 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 32,553 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది.