తెలంగాణలో ముదురుతున్న రిపబ్లిక్ డే వేడుకల వివాదం

తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకల వివాదం క్రమంగా ముదురుతోంది.కరోనా కారణంగా రిపబ్లిక్ వేడుకలను నిర్వహించలేమంటూ గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.

ఈ మేరకు రాజ్ భవన్ లోనే ఉత్సవాలు నిర్వహించుకోవాలని లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ప్రభుత్వం లేఖ రాయడంపై గవర్నర్ తీవ్రంగా స్పందించారు.

ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు.ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించకపోవడంపై తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు.2021లో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే.అప్పటి నుంచి రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య వార్ నడుస్తోంది.

మరోవైపు తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించకపోవడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది.కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించడంపై పిటిషనర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

Advertisement
అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత

తాజా వార్తలు