పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీలో( TDP ) ముసలం మొదలైంది.మాజీ ఎమ్మెల్యే శివరామ రాజు( Former MLA Sivarama Raju ) పార్టీని వీడే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
గత ఇరవై ఏళ్లుగా టీడీపీకి నిబద్ధతతో పని చేశానన్నారు.కానీ తన అభిప్రాయాన్ని తీసుకోకుండా పార్టీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించిందన్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శివరామ రాజు అభ్యర్థి ప్రకటన వ్యవహారం తనను బాధించిందని తెలిపారు.ఈ క్రమంలోనే ఈ నెల 16న పార్టీ మార్పుతో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.
ఉండి నియోజకవర్గం నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటానని తెలిపారు.