మహిళల పీరియడ్స్‌పై వీడియో వైరల్.. వారిని కూర్చోబెట్టి అభిషేకాలు, గిఫ్టులు..

పీరియడ్స్( Periods ) సమయంలో మహిళలు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు.నొప్పిని పంటి బిగువున భరిస్తూనే తమ రోజువారీ పనులు చేస్తుంటారు.

 Content Creators Video About Menstrual Cramps Going Viral On Social Media Detail-TeluguStop.com

అంతేకాకుండా ఆఫీసులోనూ తమ విధులకు హాజరు అవుతారు.వీరికి ఆ సమయంలో అంతా బాసటగా ఉండాలి.

ముఖ్యంగా కుటుంబ సభ్యులు వారికి కాస్త విశ్రాంతి ఇచ్చే ప్రయత్నం చేయాలి.దీనిని సూచిస్తూ ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ సిద్ధేష్ లోకారే( Siddesh Lokare ) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

పీరియడ్స్‌లో ఉన్న మహిళలను అతడు గౌరవించిన తీరు అందరినీ ఆలోచింపజేస్తోంది.అంతేకాకుండా అతడిని పెద్ద ఎత్తున మహిళలు అభినందిస్తున్నారు.

తమను ఆ సమయంలో ఎలా గౌరవించాలో అతడు చూపిన విధానానికి అంతా ముగ్ధులు అవుతున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర వీడియో గురించి చర్చించుకుందాం.

గత సంవత్సరం ఒక కార్యక్రమంలో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొచ్చిలోని లులు మాల్‌లో పీరియడ్ పెయిన్ సిమ్యులేటర్‌ను ఏర్పాటు చేసింది.ఎర్నాకుళం ఎంపీ హిబీ ఈడెన్ నేతృత్వంలోని “కప్ ఆఫ్ లైఫ్”( Cup Of Life ) ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం ఋతు పరిశుభ్రతను ప్రోత్సహించడం, సామాజిక నిషేధాలను సవాలు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.ఇదే తరహాలో మహిళలను గౌరవించాలనే సందేశాన్ని చాటుతూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ సిద్ధేష్ లోకారే ఓ వీడియో రూపొందించాడు.అందులో ముందుగా మహిళా ఉద్యోగులను కూర్చోబెట్టాడు.అనంతరం వారిపై గులాబీ పూలను చల్లాడు.తర్వాత వారికి గిఫ్టులు సైతం అందించాడు.

ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగానే 9 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి.

అతడిని ప్రశంసిస్తూ మహిళలు కామెంట్లు పెడుతున్నారు.ఇక అతను ఒక కోట్‌తో క్యాప్షన్‌ పెట్టాడు.‘హెలెన్ కెల్లర్ చెప్పినట్లుగా, ‘ప్రపంచం బాధలతో నిండి ఉన్నప్పటికీ, దానిని అధిగమించడం కూడా నిండి ఉంది.మీరు ఈ అధిగమించే స్ఫూర్తిని కలిగి ఉన్నారు.ఈ సమయాల్లో మీ బలం, మీ ధైర్యాన్ని ప్రతిబింబించడమే కాకుండా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మేము మీలాగే దయతో మరియు చిరునవ్వుతో పైకి ఎదగగలమని మాకు గుర్తు చేస్తుంది’ అని పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube