సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో బియ్యం ప్రతి ఒక్కరికి ప్రధాన ఆహారంగా మారిపోయింది.కానీ పూర్వం రోజులలో మన పూర్వీకులు చిరుధాన్యాలనే ఆహారంగా తీసుకునేవారు.

అందులో ముఖ్యంగా జొన్నలు, సజ్జలు, రాగులను అధికంగా తీసుకునేవారు.ఎప్పుడైతే బియ్యం తినడం మొదలుపెట్టారో అప్పటి నుంచి చిరుధాన్యాలను పక్కన పెట్టారు.

చిరుధాన్యాల వాడకం తగ్గడం పెరగడం వల్ల ప్రపంచ ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయ్యాయి.ముఖ్యంగా మారిన ఈ ఆహారపు అలవాట్ల కారణంగా గుండె సమస్యలు పెరిగిపోతున్నాయి.

గుండెకు ఆక్సిజన్ అందాక కార్డియాక్ అరెస్ట్, గుండెపోటుతో మరణించే వారి శాతం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది.రక్తనాళాలలో కొవ్వు పెరిగిపోవడం వల్ల ఎక్కువగా గుండె వైఫల్యం చెందుతున్నట్లు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నారు.

Advertisement

ఇలా రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే సజ్జలతో వండిన ఆహారాలు తినడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సజ్జాలతో చేసిన అన్నం, రొట్టెలు, అల్పాహారాలు తినడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు బయటకు పోతుందని వారు చెబుతున్నారు.అంతేకాకుండా సజ్జలలో ఉండే ఫైటో కెమికల్ రక్తనాళాల్లో కొవ్వును నిల్వ ఉండనీయదు.ఒకవేళ కొవ్వు పేరుకుపోయిన కూడా దానిని బయటకు పంపించేందుకు ఇది సహకరిస్తుంది.

ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అంతే కాకుండా సజ్జలను ఆహారంలో చేర్చుకుంటే ఎక్కువగా కాలం ఆరోగ్యంగా ఉండవచ్చు.ఈ సజ్జలలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచే గుణం ఎక్కువగా ఉంది.ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఈ ఫైబర్ జీర్ణక్రియ సజావుగా సాగిలా చేస్తుంది.శరీరంలో ఎక్కువ కొవ్వు చేరాకుండ కాపాడే గుణం సజ్జలకు ఉంది.

Advertisement

కాబట్టి అధిక బరువు బారిన పడే అవకాశం తగ్గిపోతుంది.అధిక బరువుతో ముడిపడి ఉన్న అనారోగ్యాలు అంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మధుమేహం, ఉభకయం కూడా దూరం అవుతాయి.

తాజా వార్తలు