రాజమౌళి హత్యకు కుట్ర.... సంచలన వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మ!

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి RRR సినిమాతో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో పలువురు బాలీవుడ్ డైరెక్టర్ లు రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు.

 Conspiracy To Kill Rajamouli Ramgopal Varma Made Sensational Comments , Rajamoul-TeluguStop.com

తాజాగా అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ వంటి వారు కూడా రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పాలి.

ఇలా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళిని ప్రశంసించడమే కాకుండా ఆయన సినిమాలోని కొన్ని సన్నివేశాలను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోని ప్రముఖ కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు.మొఘల్ ఈ ఆజాం తీసిన కా ఆసిఫ్ నుంచి.షోలే తీసిన రమేష్‌ సిప్పీ వరకు అందరినీ నువ్ అధిగమించావ్.

ఆదిత్య చోప్రాలు, కరణ్‌ జోహర్‌లు, భన్సాలి వంటి వారిని దాటేశావ్.నీ కాలి బొటనవేలుని తాకాలని ఉంది అంటూ ఈయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

అనంతరం మరోక ట్వీట్ చేస్తూ చిత్ర పరిశ్రమలో ఈ స్థాయిలో మంచి ఆదరణ సంపాదించుకున్న రాజమౌళిని చూసి కొంతమంది ఈర్ష పడుతూ తనని హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారు.ఇలా కుట్ర చేసే వారిలో తాను కూడా ఒకరని అయితే నాకు నాలుగు పెగ్గులు ఎక్కువగా పడటం వల్ల ఈ నిజం మొత్తం బయట పెడుతున్నానని ఈయన ట్వీట్ చేశారు.దీంతో మీరు కాస్త భద్రత కూడా పెంచుకోవాల్సి ఉంటుంది అంటూ రాజమౌళికి వర్మ హెచ్చరించారు.ఇలా రాజమౌళి పైకుట్ర జరగబోతుందంటూ వర్మ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ ఇది కేవలం వర్మ మాటలు మాత్రమేనని అర్థమవుతుంది.

ఎంతో మంచి మనసు కలిగిన జక్కన్న పై ఎందుకు కుట్ర చేస్తారంటూ పలువురు వర్మ వ్యాఖ్యలపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube