తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి అన్నారు.కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్లాయని తెలిపారు.
రాష్ట్రంలో నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని రేణుకాచౌదరి ఆరోపించారు.మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారన్న ఆమె గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో లక్షలాది మందికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించామని తెలిపారు.
పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వెల్లడించారు.