వారికి కాంగ్రెస్ టికెట్ కష్టమే..?

టి కాంగ్రెస్ లో సీట్ల పంపకలు రోజుకో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.ఇప్పటికే సీట్ల కోసం దాదాపు వెయ్యికి పైగా దరఖాస్తులు రావడంతో వాటి నుంచి ఫైనల్ అభ్యర్థులను ఎంపిక చేయడం హస్తం నేతలకు పెద్ద టాక్స్ లా మారింది.

 Congress Ticket Is Difficult For Them , Congress Party , Brs Party , Bjp Par-TeluguStop.com

అయితే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇంకా ఆలస్యం చేస్తే తిప్పలు తప్పవని భావిస్తున్న హస్తం నేతలు వీలైనంత త్వరగా మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నారట.ఇక సీట్ల పంపకలపై తాజాగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) అధ్యక్షతన స్క్రినింగ్ కమిటీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

కాగా స్క్రినింగ్ కమిటీ ఇప్పటికే 60 మంది అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు సమాచారం.దీంతో ఎవరెవరికి సీటు లభిస్తుంది.

ఎవరిని పక్కన పెట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Telugu Bjp, Brs, Congress, Jagga, Jupallykrishna, Revanth Reddy-Latest News - Te

ప్రస్తుతం హస్తం సీట్ల కోసం పార్టీలో ఉన్న నేతలతో పాటు కొత్తగా పార్టీలో చేరిన వారు సైతం గట్టిగా పోటీ పడుతున్నారు.ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.అయితే ప్రస్తుతం ఓ ఇద్దరి విషయంలో మాత్రం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

బి‌ఆర్‌ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన జూపల్లి కృష్ణారావ్( Jupally Krishna Rao ) టికెట్ లభించడం కష్టమే అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

Telugu Bjp, Brs, Congress, Jagga, Jupallykrishna, Revanth Reddy-Latest News - Te

ఈయన కొల్లాపూర్ టికెట్ ఆశించగా బి‌ఆర్‌ఎస్ ( BRS party )అందుకు నిరాకరించిందని,, దాంతో కాంగ్రెస్ లో చేరి అదే టికెట్ ఆశిస్తున్నారాయన అయితే కొల్లాపూర్ లో జూపల్లికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆధారణ లేదని అందుకే బి‌ఆర్‌ఎస్ టికెట్ నిరాకరించిందని టాక్.ఇప్పుడు కాంగ్రెస్ చేయించిన అంతర్గత సర్వేలో కూడా అదే విషయం స్పష్టమైందట.దీంతో జూపల్లికి టికెట్ లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

అటు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డికి( Jaggareddy ) సైతం టికెట్ కష్టమనే వాదన వినిపిస్తోంది.సంగారెడ్డి లో బలమైన నేతగా ఉన్న ఆయన గ్రాఫ్ పడిపోయిందనే టాక్ వినీస్తోంది.

అందుకే జగ్గరెడ్డి విషయంలో కూడా టికెట్ హోల్డ్ లో పడే అవకాశం ఉందట మరి ఈ నేతలకు టికెట్ ఫైనల్ అవుతుందా లేదా అనేది ముందు రోజుల్లో తేలనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube