తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల హడావుడి తీవ్రంగా ఉంది .గత శనివారం 55 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
ఇక వెంటనే రెండో జాబితా కూడా విడుదలవుతుందని అంతా భావించినా, రోజు రోజుకు అది ఆలస్యం అవుతోంది.దీనికి కారణం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలే.
పూర్తిగా పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఇక ఎన్నికల వ్యవహాల పైన , ప్రచార కార్యక్రమాల పైన దృష్టి పెట్టాలని భావించినా , అభ్యర్థుల ఎంపిక వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.గాంధీ భవన్ లో గత మూడు రోజుల నుంచి ఈ వ్యవహారాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మొదటి జాబితాలో బీసీ కులాలకు పెద్దగా ప్రాధాన్యం దక్కకపోవడంతో , రెండో జాబితాలో వారికి ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది .అలాగే ఎస్సీ , ఎస్టీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు సమాచారం .రెండో జాబితా ప్రకటించే సమయంలో కాంగ్రెస్ కీలక నేతలంతా తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని, తమ పేరు జాబితాలో చేర్చలేదని అసంతృప్తి వెళ్ళగక్కుతూ ఉండడం, కొంతమంది స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పార్టీ టికెట్లు అమ్ముకున్నారని విమర్శలు చేస్తుండడం వంటి వ్యవహారాలు రచ్చగా మారాయి .
దీంతో రెండో జాబితా మరింత ఆలస్యం అవుతోంది.ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది తేల్చుకోలేకపోతోంది. అసంతృప్తికి గురైన పార్టీ నాయకులు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ధర్నాలు , ఆందోళనలు చేయడం , ఫేక్సిలు చించడం వంటి వ్యవహారాలకు పాల్పడుతూ రచ్చ చేస్తున్నారు.
కొంతమంది గాంధీభవన్ కు కూడా తాళాలు వేశారు. సోమశేఖర్ రెడ్డి , రాగిడి లక్ష్మారెడ్డి , నాగం జనార్దన్ రెడ్డి వంటి వారు రేవంత్ రెడ్డి పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
ఇక మేడ్చల్ టికెట్ ఆశించి బంగపడిన హరి వర్ధన్ రెడ్డి వంటి వారు రేవంత్ పై సంచలన విమర్శలు చేస్తున్నారు .పార్టీ సీనియర్ నాయకులు చెప్పినప్పటికీ అసంతృప్తి నాయకులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.ఇక కాంగ్రెస్ బీసీ నేతల్లో కీలకమైన మధుయాష్కీ గౌడ్ , పొన్నం ప్రభాకర్ గౌడ్( Madhu Yaskhi Goud ) , మహేష్ కుమార్ గౌడ్ వంటి వారికి మొదటి జాబితాలో టికెట్లు కేటాయించలేదు.
దీంతో పాటు వారికి కనీస సమాచారం కూడా అందలేదు .దీనిపై వారు పార్టీ హై కమాండ్ ను ప్రశ్నిస్తున్నారు. వీరితోపాటు పార్లమెంట్ మాజీ సభ్యుడు రాజయ్య, బలరాం నాయక్ వంటి వారు మధు యాష్కీ నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయి బీసీల సీట్లు, మొదటి జాబితాలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి విషయాలపై చర్చించినట్లు సమాచారం .ఇటీవల పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు ఇవ్వడం పైన వారి మధ్య చర్చకు వచ్చిందట .అలాగే కమ్యూనిస్టులు , తెలంగాణ జన సమితి పార్టీతో( Telangana Jana Samithi ) పొత్తు ఉన్న నేపథ్యంలో వారికి సీట్లు ఏ విధంగా సర్దుబాటు చేయాలనే విషయం పైన తెలంగాణ కాంగ్రెస్ లో తజ్జనభజనలు జరుగుతున్నాయి.ఈ వ్యవహారాల కారణంగానే కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల జాబితా ప్రకటన మరింత ఆలస్యం అవుతోందట.