హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైయ్యారని విమర్శించారు.
దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్న ఆయన.ప్రతి దానిపై జీఎస్టీ విధించి దేశాన్ని నాశనం చేశారని ఆరోపించారు.అనంతరం అధ్యక్ష ఎన్నికపై ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు నాలుగు సార్లే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయన్నారు.ఈసారి తొమ్మిది వేల మందికి పైగా సభ్యులు అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేస్తారని తెలిపారు.
అనేక మంది సీనియర్లు తనకు మద్ధతు ప్రకటించారని చెప్పారు.తనకు ఓటు వేయాలని అభ్యర్థించేందుకే హైదరాబాద్ కు వచ్చానన్నారు.
అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నట్లు తెలిపిన.తనకు మద్ధతు తెలపాలని పీసీసీ సభ్యులను కోరుతున్నట్లు వెల్లడించారు.
ఈనెల 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని పేర్కొన్నారు.







