రాష్ట్రంలో 120 సీట్లుతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది - చింతా మోహన్

తిరుపతి:కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్ మీడియా సమావేశం.దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది.350 సీట్లకు పైగా కాంగ్రెస్ కూటమి గెలుస్తుంది.కేంద్రంలో బిజెపి పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది.10 ఏళ్ల బిజెపి పాలనలో ప్రజలు విసిగు చెందారు.మోడీ నాయకత్వంలో అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలు మాత్రమే బిజెపి ప్రభుత్వం వల్ల లాభపడ్డాయి.బిజెపి అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారింది.

 Congress Party Tirupati Parliament Candidate Chinta Mohan Comments Details, Cong-TeluguStop.com

అన్ని రకాల నిత్యవసర ధరలు పెరిగాయి.బిజెపి, ఎన్ డి ఏ కూటమి 150 సీట్లకే పరిమితం అవుతుంది.

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.రాష్ట్రంలో 120 సీట్లుతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యార్థుల స్కాలర్షిప్లు రెట్టింపు చేస్తాం.రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది.

తెలంగాణలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది.

దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.రాష్ట్ర రాజధాని విషయంలో కాంగ్రెస్ ఐ కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube