తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేయాలని బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) అన్నారు.అర్హులకు కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలన్నారు.

అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project )లో అవినీతి జరిగింది వాస్తవమన్న బండి సంజయ్ ఇంకా టైంపాస్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని తిట్టడం మానుకోవాలన్నారు.కాళేశ్వరంపై సీబీఐ విచారణ( CBI investigation ) ఎందుకు కోరడం లేదో చెప్పాలన్నారు.ప్రభుత్వం విచారణ జరపడంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు.తెలంగాణలో బీఆర్ఎస్ మునిగిన నావని విమర్శించారు.







