దక్షిణాదిలో ఆ పార్టీదే పైచేయి !

ప్రస్తుతం దేశంలో ఉన్న జాతీయ పార్టీలు ఏవంటే.ఎవరైనా కాంగ్రెస్, బీజేపీ పార్టీలే అని చెబుతారు.

 Congress Party Has The Upper Hand In The Southern States Details, Bjp, Congress,-TeluguStop.com

ఎందుకంటే ఈ రెండు పార్టీలకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది.దేశంలో అన్నీ వైపులా ఈ రెండు పార్టీలు మాత్రమే అత్యంత ప్రజాధరణ కలిగినవిగా చెప్పుకోవచ్చు.

అందుకే కేంద్రంలో అధికారం కోసం ఈ రెండు పార్టీల మద్యనే ప్రధాన పోరు ఉంటుంది.ప్రస్తుతం దేశంలో అన్నీ వైపులా బీజేపీ ( BJP ) హవానే నడుస్తోంది.

మోడి మేనియాతో గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం కోసం ఉవ్విళ్లూరుతోంది.అటు కాంగ్రెస్( Congress Party ) ఒకప్పటితో పోల్చితే కాస్త బలహీన పడినప్పటికి.

ప్రస్తుతం తిరిగి బలం పెంచుకుంటోంది.

Telugu Amith Sha, Congress, Karnataka, Narendra Modi, National, Rahul Gandhi, Te

దీంతో వచ్చే ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదనే చెప్పవచ్చు.అయితే ఉత్తరాడిన ఈ రెండు పార్టీలకు తిరుగులేనప్పటికి.అసలు సమస్యంతా దక్షిణాది రాష్ట్రాలలోనే.

ప్రంతియాభిమానం అధికంగా ఉండే దక్షిణాదిలో ఈ రెండు జాతీయ పార్టీలకు ఆధారణ తక్కువ ఎన్నో ఏళ్లుగా దక్షిణాదిలో బలపడాలని చూస్తున్న బీజేపీ కోరిక కలగానే మిగులుతోంది తప్పా నెరవేరడం లేదు.మొన్నటివరకు కర్నాటకలో( Karnataka ) అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఆరాష్ట్రంలో కూడా అధికారాన్ని కోల్పోయింది.

దీంతో దక్షిణాదిన బీజేపీ శూన్యంగా మిగిలింది.అయితే బీజేపీతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ కొంత బలంగా ఉంది.

Telugu Amith Sha, Congress, Karnataka, Narendra Modi, National, Rahul Gandhi, Te

ప్రస్తుతం అధికారంలో ఉన్న కర్నాటక రాష్ట్రంతో పాటు తెలంగాణలో( Telangana ) కూడా కాంగ్రెస్ కొంతమేర ప్రభావం చూపగలదు.ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో ఇంకా బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది.అయితే ఈ రాష్ట్రాలలో జాతీయ పార్టీలు బలపడడం కష్టమే అని విశ్లేషకులు చెబుతున్నారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే దక్షిణాది రాష్ట్రాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

మరి ఎన్నికలకు సరిగా ఏడాది మాత్రమే సమయం ఉంది.మరి ఏ ఏడాదిలో ఈ రెండు జాతీయ పార్టీలు దక్షిణాది రాష్ట్రాలలో బలపడేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తాయి.

ఏ పార్టీలతో పెట్టుకుంటాయనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube