బీఆర్ఎస్ లోని కీలక నాయకులతో పాటు, గతంలో కాంగ్రెస్ లో కీలకంగా ఉండి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరిన నేతలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) దృష్టి పెట్టారు.వచ్చే లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి ఎన్నికల కంటే ముందుగా పార్టీలోకి భారీగా చేరికలు ఉండేలా చూసుకుని , పార్టీని మరింత బలోపేతం చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు.
అందుకే వివిధ కారణాలతో బయటకు వెళ్లిన పాత నాయకులను తిరిగి కాంగ్రెస్ గూటికి రప్పించే విషయంపై దృష్టి పెట్టారు.వీరితోపాటు బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న అసంతృప్త నేతలను కాంగ్రెస్ వైపుకు తీసుకువచ్చి , బీఆర్ ఎస్ ను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలని రేవంత్ ప్లాన్ చేసుకుంటున్నారు.

దీనిలో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారు.తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) తనకు అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో, వీలైనంత ఎక్కువ స్థానాలను తెలంగాణలో గెలుచుకుంటేనే కాంగ్రెస్ అధిష్టానం పెద్దల వద్ద తన పలుకుబడి ఉంటుందని, తెలంగాణ కాంగ్రెస్ లోనూ తనకు మరింత బలం పెరుగుతుందని రేవంత్ అంచనా వేస్తున్నారు.అందుకే వచ్చే ఎన్నికలే ప్రధాన టార్గెట్ గా పార్టీలో చేరికల జోరు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఢిల్లీ పర్యటనలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తో కండువా కప్పించారు రేవంత్ రెడ్డి.
అలాగే మన్నే జీవన్ రెడ్డి( Manne Jeevan Reddy )ని కూడా కాంగ్రెస్ లో చేర్చుకున్నారు.

మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం ఆయన అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఎట్టి పరిస్థితుల్లోనైనా 12 ఎంపీ సీట్లు అయిన గెలవాలనే పట్టుదలతో రేవంత్ ఉన్నారు.ఇతర పార్టీలోని అసంతృప్త నేతలను గుర్తించి వారిని కాంగ్రెస్ లో చేర్చుకునే వ్యూహంలో రేవంత్ ఉండడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
బీ ఆర్ ఎస్ లో కీలకంగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి ,నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.వీరితో పాటు మాజీమంత్రి రాజయ్యా కూడా టిఆర్ఎస్ కు రాజీనామా చేశారు.
ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు .రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుంది.అలాగే మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీ ఆర్ ఎస్ ను వీడే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఇలా వరుసగా బీఆర్ఎస్ లోని కీలక నేతలందరిని కాంగ్రెస్ లో చేర్చుకుని ఆ పార్టీ దెబ్బతీయడంతో పాటు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్త చాటుకోవాలని పట్టుదలతో రేవంత్ ఉన్నారు.