మునుగోడు ఉపఎన్నిక ప్రచారం విషయంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రచారానికి వెళ్లే యోచన లేదని ఆయన మరోసారి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
మునుగోడులో తన లాంటి హోమ్ గార్డ్ ప్రచారం అవసరం లేదని చెప్పారు.ఎస్పీ స్థాయి వాళ్లే మునుగోడు ప్రచారానికి వెళ్లారని పేర్కొన్నారు.
వంద కేసులు పెట్టినా ప్రభుత్వాన్ని తీసుకొస్తానని ఓ నాయకుడు చెప్పారన్నారని వెల్లడించారు.మునుగోడులోనై ఆయనే గెలిపిస్తారని తమతో పనిలేదని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
అయితే సొంత పార్టీ నేతల తీరుపై కోమటిరెడ్డి అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.కాగా, సొంత పార్టీ నేతలపై ఆయన విమర్శలు సంధించడం చర్చనీయాంశంగా మారింది.







