మాజీ మంత్రి కేటీఆర్( Former Minister KTR ) పంపిన లీగల్ నోటీసుపై మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.తనతో పాటు మరో ఇద్దరికి కేటీఆర్ లీగల్ నోటీసులు( Legal Notices ) పంపారని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ పై వరుస కథనాలు వస్తున్నాయన్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి( Yennam Srinivas Reddy ) తన ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.విచారణ జరుగుతున్న సమయంలో లీగల్ నోటీసులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.
లీగల్ నోటీసులు పంపి బెదిరించాలని కేటీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు.