టిఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి ! ఆయన స్పందన ఏంటంటే ? 

గత కొంత కాలంగా కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారడ్డి టిఆర్ఎస్ లో చేరబోతున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

దీనికి తగ్గట్లుగానే జగ్గారెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ను ప్రశంసిస్తూ వస్తున్నారు.

అలాగే సొంత పార్టీ కి చెందిన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, గత కొంత కాలంగా సంచలనం సృష్టిస్తూనే వస్తున్నారు.తాజాగా టిఆర్ఎస్ లో చేరిక పై జగ్గారెడ్డి స్పందించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిన జర్నలిస్టులకు ఇల్లు,  జాగ్వర్ కార్ ఇస్తే తాను కారు పార్టీ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.ఇళ్ల గృహప్రవేశం కాగానే , టీఆర్ఎస్ పార్టీలోకి వస్తానని,  అసెంబ్లీ ఆవరణలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,  ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి , అక్కడే ఉన్న జర్నలిస్టుతో జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతే కాదు అవసరం అనుకుంటే ఎన్నికలో పోటీ సైతం చేయనని జగ్గారెడ్డి అన్నారు.       ఇదే విషయాన్ని తన అసెంబ్లీ నియోజకవర్గం లోని ప్రజలకు చెబుతానన్నారు.

Advertisement

ఈ సందర్భంగా టిఆర్ఎస్,  కేసీఆర్ పైన జగ్గారెడ్డి కామెంట్స్ చేశారు.తాను టిఆర్ఎస్ పార్టీ , కెసిఆర్ పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ లో చేరలేదని ఆయన చెప్పడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే టీఆర్ఎస్ విషయంలో జగ్గారెడ్డి సానుకూలంగానే ఉన్నారని, అందుకే ఆ పార్టీ పై పెద్దగా విమర్శలు చేయకుండా ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారు అనే చర్చ ఈ  సందర్భంగా మొదలైంది.   

  అయితే ఇటీవల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం తీవ్రంగా తగ్గిపోవడం , ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కనీసం పోటీ ఇచ్చే స్థాయికి కాంగ్రెస్ వెళ్ళ లేక పోవడం, సానుకూల ఫలితాలు రాకపోవడం ఇవన్నీ కాంగ్రెస్ నాయకుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ క్రమంలో చాలా మంది ఇతర పార్టీలలో చేరేందుకు ఏర్పాట్ల చేసుకుంటూ,  తమ రాజకీయ జీవితానికి ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగ్గారెడ్డి టిఆర్ఎస్ విషయంలో దాటవేత ధోరణిని అవలంబిస్తూ వస్తుండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

ఉల్లి తొక్కలను పారేస్తున్నారా.. జుట్టుకు ఇలా వాడితే బోలెడు లాభాలు!
Advertisement
" autoplay>

తాజా వార్తలు