తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.బాన్సువాడలో సభలో కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఎన్నికల ప్రసంగంలో కేసీఆర్ విద్వేష పూరితమైన వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ తెలిపారు.కేసీఆర్ వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని పిటిషనర్ వెల్లడించారు.
ఈ క్రమంలో బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం రేపు విచారణ జరిపే అవకాశం ఉంది.







