ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విశాఖ గర్జన కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేశారు.విశాఖలో గర్జన నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
వైసీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో గర్జన సభ పెట్టాలని డిమాండ్ చేశారు.ఉత్తరాంధ్రకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని పార్లమెంట్ ఎదుట లేదా ప్రధాని మోదీ ఇంటి వద్ద గర్జనసభ పెట్టాలని అన్నారు.
అయితే, వికేంద్రీకరణకు, మూడు రాజధానులకు మద్ధతుగా విశాఖలో గర్జన కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మూడు కిలోమీటర్లకు పైగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ర్యాలీలో పాల్గొన్నారు.