షబ్బీర్ అలీ..అడ్డంగా బుక్కయ్యరా ?

తెలంగాణా కాంగ్రెస్ శాసన మండలి పక్ష నేత షబ్బీర్ అలీ ఈడీ కేసులో ఇరుక్కున్నారు అని వార్తలు ఇప్పుడు తెలంగాణలో హల్చల్ చేస్తున్నాయి.వాస్తవం ఎంతవరకు ఉందో కానీ.

 Congress Leader Shabbir Ali Named In Ed Chargesheet In Hawala Case-TeluguStop.com

ప్రస్తుతానికి ఈ వార్తా కాంగ్రెస్ వర్గాలలో కలకలం రేపుతోంది.ఒక ఇంగ్లీష్ పత్రికలో ప్రచురించిన కధనాలు ప్రకారం సిబిఐ కేసులో నిందితుల తరుపున సిబిఐ డైరెక్టర్స్ కి లంచాలు తీసుకెళ్ళారు.

సీబీఐ మాజీ డైరెక్టర్లు ఏపీసింగ్‌, రంజిత్‌ సిన్హాలకు హవాలా మార్గంలో నిధులందించిన ప్రధాన నిందితుడు మొయిన్‌ ఖురేషీతో పాటు ఈడీ చార్జిషీటులో షబ్బీర్‌ అలీ పేరుందా? అనే సందేహాలు ఇప్పుడు షబ్బీర్ అలీ పాత్రపై అనుమాలని రేకెత్తిస్తున్నాయి

యూపీఏ ప్రభుత్వ హయాంలో సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న పలువురు నిందితులు కేసుల నుంచి బయట పడేందుకు సీబీఐ డైరెక్టర్లకి లంచాలు ఇచ్చారు.ఇందుకోసం మాంసం ఎగుమతి చేసే మొయిన్‌ ఖురేషీ ఢిల్లీ హవాలా ఆపరేటర్ల సాయంతో ముడుపుల సొమ్మును సీబీఐ అధికారులకు చేరవేశాడు.

ఇది ఇలా ఉంటే…హైదరాబాద్‌కు చెందిన ఎంబీఎస్‌ జ్యువెల్రీస్‌.కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎంటీఎ్‌సకు రూ.200 కోట్ల నష్టం కలిగించిన కేసులో సుఖేశ్‌ గుప్తా అనే వ్యక్తిని సీబీఐ గతంలో అరెస్టు చేసింది.సీబీఐ కేసు నుంచి ఆయన్ను కాపాడేందుకు షబ్బీర్‌ అలీ రంగంలో దిగారన్నది ఆరోపణ

సతీశ్‌ సనా అనే వ్యాపారితో కలిసి షబ్బీర్‌ అలీ 1.5 కోట్లను ఢిల్లీకి తీసుకెళ్లి మొయిన్‌ ఖురేషీకి అందించారని ఈడీ సోమవారం దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొన్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి.అయితే షబ్బీర్ అలీ ఈ వార్తలని ఖండించారు.

తనకి ఈడీ నుంచీ కానీ సిబిఐ నుంచీ కానీ ఎలాంటి నోటీసులు రాలేదన్నారు.కాబట్టి చార్జిషీటులో తనపేరు ఉండే అవకాశం లేదని చెప్పారు.

ఒక వేల ఈడీ పిలిస్తే తప్పకుండ వెళ్తా అని దర్యప్తుకి సహకరిస్తా ని చెప్పారు షబ్బీర్ అలీ.కొన్ని రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు కానున్నాయి.ఈ సమావేశాల్లో ఎలా అయినా టీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టాలి అని కష్టపడుతున్న టీ –కాంగ్రెస్ కి ఇది ఊహించని దెబ్బ.ఇప్పుడు కాంగ్రెస్ పిలక టీఆర్ఎస్ చేతికి దొరికినట్టయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube