రేవంత్ సరికొత్త యాక్షన్ ప్లాన్ !  మరో రెండు రోజుల్లోనే ?

తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు గా పోటీ నెలకొంది.

ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రధాన పార్టీలుగా మారడం, కాంగ్రెస్ పూర్తిగా పక్కకు వైదొలిగినట్టుగా పరిస్థితి ఉంది.

తెలంగాణాలో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటూ వస్తోంది.కాంగ్రెస్ తెలంగాణాలో క్రమంగా బలహీనపడడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది.

అసలు కాంగ్రెస్ కు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం, ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు అనేది అందరికీ తెలిసిందే.పూర్తిగా అట్టడుగుకు వెళ్లిపోయిన కాంగ్రెస్ ను ఎలా పైకి తీసుకురావాలి అనే విషయం పైన ఆ పార్టీ తెలంగాణ నేతల దృష్టి సారించకపోవడం, పార్టీ పదవులు విషయమై నిత్యం సొంత పార్టీ నాయకులతో తగువులాడుకునే పరిస్థితి నెలకొంది.

ఇక కాంగ్రెస్ తెలంగాణలో ఏదో ఒక రకంగా బలోపేతం చేసి, అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనతో ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడంతోపాటు, తన వ్యక్తిగత ఇమేజ్ ని పెంచుకునే విధంగా రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నారు.

Advertisement

ఇటీవలే ఆర్మూర్ లో పసుపు రైతులకు మద్దతుగా రేవంత్ దీక్ష చేపట్టారు.ఇక అదే మాదిరిగా తెలంగాణ వ్యాప్తంగా నిరంతరం దీక్షలు, ఆందోళనలు నిర్వహించేందుకు రేవంత్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇక నిత్యం ఏదో ఒక నియోజకవర్గం ను ఎంపిక చేసుకుని స్థానిక ప్రజల సమస్యలు, రైతు సమస్యల పై పోరాడుతూ, తెలంగాణవ్యాప్తంగా పర్యటించేందుకు ఆయన ప్లాన్ చేసుకుంటున్నారట.దీనిలో భాగంగానే ఈనెల 7వ తేదీన అచ్చంపేటలో దీక్షకు రేవంత్ రెడీ అవుతున్నారు.

ఇక అక్కడి నుంచి వరుసగా రేవంత్ పర్యటనలు తెలంగాణ వ్యాప్తంగా ఉండబోతున్నాయి.తన పర్యటన ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించడంతో పాటు, తెలంగాణలో కాంగ్రెస్ కు మరింత బలం పెరిగేలా చేయడం, అలాగే తన వ్యక్తిగత ఇమేజ్ సైతం పెరిగే విధంగా రేవంత్ ప్లాన్ చేసుకుంటున్నారు.కేంద్రం జమిలి ఎన్నికలు నిర్వహించే ఆలోచనతో ఉండడంతో, ఇప్పటి నుంచే దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.

ఇక అవసరమైతే తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర సైతం చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లను రేవంత్ చేసుకుంటున్నారు.ఈ పర్యటనలతో పాటు పాదయాత్ర చేసే ఉద్దేశంలో రేవంత్ ఉన్నారట.ఇవన్నీ తనకు, పార్టీకి కలిసి వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఉల్లి తొక్కలను పారేస్తున్నారా.. జుట్టుకు ఇలా వాడితే బోలెడు లాభాలు!
Advertisement

తాజా వార్తలు