ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తుపై కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్( Congress Leader Manickam Tagore ) విమర్శలు చేశారు.స్వప్రయోజనాల కోసం చంద్రబాబు( Chandrababu Naidu ) ఏపీ అవసరాలను తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిరాకరించడం మినహా బీజేపీతో విభేదాలు లేవని చెబుతున్నారన్న ఆయన బీజేపీ( BJP ) ప్రత్యేక హోదా ఇవ్వకున్నా పొత్తును అంటి పెట్టుకుని ఉన్నారా అని ప్రశ్నించారు.చంద్రబాబుకు ఏపీ అవసరాల కన్నా, ప్రజల కన్నా స్వప్రయోజనం ఎక్కువ అయినట్లు కనిపిస్తోందని విమర్శించారు.







