ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.జిల్లాలో ఉన్న పది స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యతను కనబరుస్తుంది.
వీటిలో రెండు స్థానాల్లో హస్తం పార్టీ విజయం సాధించగా మరో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ బోణి కొట్టింది.భద్రాచలంలో బీఆర్ఎస్ గెలుపొందింది.
ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు సుమారు 6,277 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు.అశ్వారావుపేట, ఇల్లందు నియోజకవర్గాల్లో గెలుపొందింది.
ఇటు కొత్తగూడెంలో కాంగ్రెస్ మద్ధతుతో బరిలో నిలిచిన కూనంనేని సాంబశివరావు ముందంజలో ఉన్నారు.కాగా తెలంగాణ వ్యాప్తంగా ముందంజలో ఉన్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను దాటి దూసుకెళ్తుంది.







