దానిమ్మ పంట సాగులో( Pomegranate Cultivation ) పంట చేతికి వచ్చే సమయంలో కాయలకు బాక్టీరియల్ ముడత వచ్చి రైతులకు( Farmers ) ఊహించని నష్టాన్ని ఇస్తుంది.దానిమ్మకాయలకు సహజ రంధ్రాలు లేదా గాయాలు అయితే వాటి ద్వారా బ్యాక్టీరియా కాయలోకి ప్రవేశిస్తుంది.ఎక్కువగా శీతాకాలంలో ఈ బ్యాక్టీరియా తెగులు దానిమ్మ చెట్లను ఆశించడం జరుగుతుంది.30 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ బ్యాక్టీరియా బాగా పెరిగి పంటకు ఊహించని నష్టం తెస్తుంది.

నీటి తుంపర్లు, సాగునీరు, పనిముట్లు, క్రిమివాహకాలు ఈ బ్యాక్టీరియా ( Bacteria )వ్యాప్తికి కారణం అవుతాయి.ఈ బ్యాక్టీరియా దానిమ్మకాయను ఆశించిన రెండు లేదా మూడు రోజుల తర్వాత పసుపు రంగు నీటితో తుడిచినట్లు ఉండే వృత్తాకార మచ్చలు కనిపిస్తాయి.ఆ తర్వాత దానిమ్మకాయలపై వృత్తాకారం మచ్చలు గాయాల మాదిరిగా కనిపిస్తాయి.కాండం మరియు కొమ్మలలో పగుళ్లు కూడా కనిపిస్తాయి.దానిమ్మ పంట ఏ దశలో ఉన్న ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.ఈ బ్యాక్టీరియా సోకిన మొక్కలు కనిపిస్తే.
ఆ బ్యాక్టీరియా సోకిన మొక్క కొమ్మను పూర్తిగా తొలగించి కాల్చి నాశనం చేయాలి.పొలంలో ఎప్పుడు పరిశుభ్రమైన పనిముట్లు మాత్రమే ఉపయోగించాలి.
పొలంలో పనిచేస్తున్నప్పుడు మొక్కలకు ఎటువంటి గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

సేంద్రీయ పద్ధతిలో( Organic method ) ఈ బ్యాక్టీరియాను అరికట్టాలంటే వేప ఆకులను ఆవు మూత్రంలో నాని బెట్టి, దానితో మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.తులసి ఆకు రసం లేదా వేప గింజల నూనె పిచికారి చేయడం వల్ల కూడా ఈ వ్యాధిని అరికట్టవచ్చు.ఒకవేళ రసాయన పద్ధతిలో ఈ బ్యాక్టీరియాను అరికట్టాలంటే కప్టాన్, బ్రోమోపోల్, కాపర్ హైడ్రాక్సైడ్ లను పిచికారి చేసి పంటను సంరక్షించుకోవచ్చు.తొలి దశలోనే ఈ బ్యాక్టీరియాను అరికట్టకపోతే పంట నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది.







