బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తే పార్టీ కాంగ్రెస్..: హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్ తీరని అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తే పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు.

గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని బీజేపీ మోసం చేసిందని హరీశ్ రావు ఆరోపించారు.రూ.2 లక్షల రుణమాఫీ చేసిన తరువాతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలని తెలిపారు.అధికారంలోకి రాగానే ఉచిత కరెంట్ అని మాట తప్పారని మండిపడ్డారు.రైతుభరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.10 వేలు కూడా ఇవ్వలేదన్నారు.కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కరోనా వచ్చినా కూడా రైతుబంధును ఆపలేదని చెప్పారు.

ఈ నేపథ్యంలో హామీలను అమలు చేయాలని ప్రజల తరపున గుర్తు చేస్తున్నామని తెలిపారు.

అప్పుడు 100 రూపాయలు.. ఇప్పుడు రూ.300 కోట్లు.. బన్నీ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు