కరీంనగర్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పై మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ పాత్ర పోషించిందని కేసీఆర్ గుర్తు చేశారు.ఈ క్రమంలోనే కరీంనగర్ మట్టికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్లు చెప్పారు.
తాను గతంలో ఆమరణ దీక్షకు శ్రీకారం చుట్టింది కరీంనగర్ గడ్డ నుంచేనని తెలిపారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
ఈ క్రమంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందని పేర్కొన్నారు.అనంతరం కాంగ్రెస్ పై మండిపడిన కేసీఆర్ అది మోసకారి పార్టీ అని దుయ్యబట్టారు.
సుమారు యాభై ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు.







