కేసీఆర్ టీమ్ అవుట్ .. రేవంత్ టీమ్ ఇన్ !

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తొలిరోజు నుంచి తన మార్క్ పరిపాలన ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.ముఖ్యంగా కాంగ్రెస్( Congress ) ప్రకటించిన ఎన్నికల హామీలన్నిటిని అమలు చేస్తామని చెబుతూనే, ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకాన్ని చేశారు.

 Congress Govt Removed Seven Advisers Appointed During Brs Govt Details, Revanth-TeluguStop.com

ఇక గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారులు, ప్రభుత్వ సలహాదారులను తప్పించే పనిపై రేవంత్ దృష్టి సారించారు.ముఖ్యంగా గత ప్రభుత్వంలో కేసీఆర్( KCR ) నియమించిన ఏడుగురు సలహాదారులను తొలగిస్తూ రేవంత్ ఉత్తర్వులు జారీ చేశారు.

  వీరితో పాటుగా స్పెషల్ ఆఫీసర్లను తప్పిస్తూ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

Telugu Ak Khan, Anurag Sharma, Kv Ramana Chari, Rajeev Sharma, Revanth Reddy, Sk

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడుగురు సలహాదారులను నియమించారు .వివిధ విభాగాల్లో ప్రత్యేక అధికారులను నియమించారు.వీరందరిని ఇప్పుడు తప్పిస్తూ రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.

 సీఎం ముఖ్య సలహాదారుగా ఉన్న సోమేశ్ కుమార్,( Somesh Kumar ) ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న రాజీవ్ శర్మ,( Rajeev Sharma )  సాంస్కృతిక, దేవదాయ సలహాదారుగా ఉన్న కె.వి.రమణాచారి ,( KV Ramanachari ) ప్రభుత్వ ప్రధాన సలహాదారు చెన్నమనేని రమేష్ , హోంశాఖ సలహాదారు అనురాగ్ శర్మ, ముస్లిం,  మైనారిటీ సంక్షేమ సలహాదారు ఏకే ఖాన్, అటవీ సంరక్షణ శాఖ ముఖ్య సలహాదారు శోభను రేవంత్ తప్పించారు.వీరితో పాటు,  ప్రత్యేక అధికారుల హోదాలో ఉన్న వారిని తప్పించారు. 

Telugu Ak Khan, Anurag Sharma, Kv Ramana Chari, Rajeev Sharma, Revanth Reddy, Sk

ఇరిగేషన్ అడ్వైజర్ ఎస్కే జోషి,( SK Joshi ) ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఆఫీసర్ జి ఆర్ రెడ్డి , శివశంకర్ , ఆర్ అండ్ బి స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ తేజ , ఇందన సెక్టార్ స్పెషల్ ఆఫీసర్లు రాజేంద్రప్రసాద్ సింగ్ , ఉద్యాన శాఖ అడ్వైజర్ శ్రీనివాసరావులను ఆ హోదాల నుంచి తప్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు.వీరి నియామకాలు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వ్యుల్లో పేర్కొన్నారు. ఇక వీరితో పాటు కొన్ని కీలక స్థానాల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ లను తప్పించే ఆలోచనలు ఉన్నారు .కెసిఆర్ కు అనుకూలమైన వ్యక్తులుగా ముద్రపడిన అధికారులను తప్పించి పూర్తిగా తన టీంను ఏర్పాటు చేసుకునే ప్రయత్నల్లో రేవంత్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube